- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, బంగ్లా వైట్‌బాల్ సిరీస్ వాయిదా
డిసెంబర్‌లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడినట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది.

దిశ, స్పోర్ట్స్ : డిసెంబర్‌లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడినట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. భారత్‌లో బంగ్లాదేశ్ టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టుకు సుదీర్ఘ విరామం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది. ఇదే విషయాన్ని బంగ్లా బోర్డుకు తెలియజేసింది. ‘సిరీస్ ఇప్పుడు జరగడం లేదని బీసీసీఐ మాకు తెలియజేసింది. డబ్ల్యూపీఎల్ కంటే ముందు వారు తమ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ, ఇది రద్దైనట్టు కాదు. సిరీస్ వాయిదా వేయబడింది. రీషెడ్యూల్ ఉంటుందని కచ్చితంగా చెప్పగలం.’అని బీసీబీ ఉమెన్స్ వింగ్ చైర్మన్ అబ్దుర్ రజాక్ తెలిపారు. ఆగస్టులో భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సిన ఉండగా ఆ సిరీస్ వాయిదా పడిన విషయం తెలిసిందే.






