- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: పాకిస్థాన్ తప్పుకుంటే మళ్లీ బంగ్లాదేశ్ ఎంట్రీ?
పాకిస్తాన్ డ్రామాలు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ బీ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ఆడేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా, పాకిస్తాన్ కూడా అదే బాటలో నడిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ ఆడేందుకు ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్ ప్రకటించింది. కానీ ఈ టోర్నమెంట్ బాయ్ కాట్ చేస్తామంటూ పరోక్షంగా హింట్ ఇస్తోంది. అయితే పాకిస్తాన్ డ్రామాలు చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ బీ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ఔట్.. బంగ్లాదేశ్ కు బంపర్ ఆఫర్ ?
టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి పాకిస్తాన్ కూడా వైదొలిగితే, బంగ్లాదేశ్ డిమాండ్లను పరిష్కరించేందుకు ఐసీసీ సిద్ధమవుతోందట. ఇండియాలో కాకుండా శ్రీలంకలో తమ మ్యాచ్ లను నిర్వహించాలని పదేపదే బంగ్లాదేశ్ కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే, కచ్చితంగా బంగ్లాదేశ్ కు అవకాశం ఇవ్వనుందట ఐసీసీ.
వాళ్లు అడిగినట్లుగానే శ్రీలంకలో బంగ్లాదేశ్ మ్యాచ్ లు నిర్వహించేందుకు సంసిద్ధం అవుతోందట. ఇదే జరిగితే పాకిస్తాన్ కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. మరి దీనిపై పాకిస్తాన్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. వచ్చే సోమవారం లోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ఇప్పటికే బయటకు వెళ్లగా, కొత్తగా స్కాట్లాండ్ బరిలోకి దిగింది.






