శ్రీలంకనే ఓడించాం...ఇవాళ టీమిండియాను మట్టి కనిపిస్తాం - బంగ్లా కోచ్

by velandi.Saikiran |

టీమిండియాతో మ్యాచ్ ఉన్న నేప‌థ్యంలో బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు

శ్రీలంకనే ఓడించాం...ఇవాళ టీమిండియాను మట్టి కనిపిస్తాం - బంగ్లా కోచ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా ఇవాళ టీమిండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య సూప‌ర్ 4 మ్యాచ్ జ‌రుగ‌నుంది. దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం.. ఇవాళ రాత్రి 8 గంట‌లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో టాస్ గెలిచిన జ‌ట్టు మొద‌ట బౌలింగ్ తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే.. టీమిండియాతో మ్యాచ్ ఉన్న నేప‌థ్యంలో బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తీ జ‌ట్టు... టీమిండియాను ఓడిస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఆ స‌త్తా బంగ్లాదేశ్ కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మూడు గంట‌ల మ్యాచ్ లో ఫ‌లితం ఎప్పుడైనా మార‌వ‌చ్చు.. అందుకే ఇవాళ బంగ్లాదేశ్ గెలుస్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టికే శ్రీలంక‌ను ఓడించాం.. టీమిండియాను ఓడిస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో...బంగ్లా కోచ్ ఫిల్ సిమన్స్ చేసిన‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Next Story