- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడటానికి నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి మరో షాక్ తగిలింది. ఐర్లాండ్‌తో గ్రూపు స్వాప్ చేయాలన్న బీసీబీ ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది. శనివారం ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బీసీబీ.. తమ జట్టును గ్రూపు బిలో చేర్చి.. ఐర్లాండ్‌ను గ్రూపు సిలో చేర్చాలని కోరింది. గ్రూపు బి మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్న విషయం తెలిసిందే. గ్రూపు స్వాప్ చేయడం ద్వారా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు ఐసీసీగానీ, ఐర్లాండ్‌గానీ సిద్ధంగా లేవు. తమ గ్రూపు మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ఐర్లాండ్ తెలిపింది. ‘ముందుగా ప్రకటించిన షెడ్యూల్ నుంచి మిమ్మల్ని తరలించమని మాకు స్పష్టమైన హామీలు ఇచ్చారు. మేము కచ్చితంగా గ్రూపు మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతాం.’అని క్రికెట్ ఐర్లాండ్ ప్రతినిధి పేర్కొన్నారు. పొట్టి ప్రపంచకప్‌కు ఇంకెంతో సమయం లేదు. 20 రోజుల్లో టోర్నీ ప్రారంభంకానుంది. మరి, బంగ్లా విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






