- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిగివచ్చిన బంగ్లాదేశ్..టీ20 వరల్డ్ కప్ పై కీలక ప్రకటన !
ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇండియాలో పర్యటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాజాగా నిర్ణయం తీసుకుందట.

దిశ, వెబ్ డెస్క్: టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ పై తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో భారత్ లో తాము పర్యటించబోమని ముందుగా మొండి పట్టు పట్టింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. పాకిస్తాన్ తరహాలో తమ మ్యాచ్ లు కూడా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి ఇటీవల బంగ్లాదేశ్ లేఖ కూడా రాసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ పై బీసీసీఐ వేటు వేసిన నేపథ్యంలో బంగ్లా ఇలా తలతిక్క నిర్ణయం తీసుకుని, లేఖ రాసింది. అయితే, దీనిపై స్పందించిన ఐసీసీ, బంగ్లాదేశ్ ప్రతిపాదనలు రిజెక్ట్ చేసింది.
దిగివచ్చిన బంగ్లాదేశ్..ఐసీసీ రూల్స్ ప్రకారమే
తాము ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆడకపోతే, టోర్నమెంట్ ప్రకారం ఇచ్చే పాయింట్లు కట్ చేస్తామని హెచ్చరించింది ఐసీసీ. అయితే ఐసీసీ దిగి రాక పోవడంతో బంగ్లాదేశ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇండియాలో పర్యటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తాజాగా నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ఐసీసీకి కూడా సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, కోల్ కతాలో కాకుండా చెన్నై స్టేడియంలో తమ మ్యాచ్ లు పెట్టాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారట. మరి దీనికి ఐసీసీ ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.






