- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు బౌలర్ల ప్రతాపం.. 5 వికెట్లు కోల్పోయిన గుజరాత్
ఐపీఎల్-2026లో భాగంగా క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌కు ఆర్సీబీ 255 పరుగుల బిగ్ టార్గెట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది అత్యధిక టీమ్ టోటల్ కావడం విశేషం. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, ఏకంగా 9 సిక్సర్లు ఉన్నాయి. చివరి 6 ఓవర్లలోనే ఆర్సీబీ 114 పరుగులు రాబట్టింది.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 120 బంతుల్లో 255 టార్గెట్ ఛేదించాల్సి ఉండగా.. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ చేతులెత్తేశారు. సాయి సుదర్శన్ 9 బంతుల్లో 14 పరుగులు చేశాడు. షాట్ ఆడుతున్న క్రమంలో అతడి బ్యాట్ వికెట్లను తగిలి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం గిల్ 2 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన జోస్ బట్లర్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి ధాటిగా ఆడుతున్న క్రమంలో జాష్ హేజిల్‌వుడ్ వేసిన బంతి వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 5 కీలక వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది.






