- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BAN vs PAK : తొలి టీ20లో పాక్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్
ఇటీవలే శ్రీలంకపై టీ20 సిరీస్ విజయం సాధించిన బంగ్లాదేశ్ సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : ఇటీవలే శ్రీలంకపై టీ20 సిరీస్ విజయం సాధించిన బంగ్లాదేశ్ సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. ఢాకా వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో పాక్‌కు షాకిచ్చింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. ఫకర్ జమాన్(44) టాప్ స్కోరర్. పాక్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. మరో ఇద్దరు డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు, ముస్తాఫిజుర్ 2 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఇక, 110 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ అలవోకగా ఛేదించింది. 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. పర్వేజ్ హుస్సేన్ ఎమాన్(56 నాటౌట్) హాఫ్ సెంచరీతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తౌహిద్ హృదయ్(36) పర్వాలేదనిపించాడు. ఈ విజయంతో బంగ్లా మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం రెండో టీ20 జరగనుంది.
- Tags
- BAN vs PAK






