బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. హ్యాట్రిక్ విజయం నమోదు

by Harish |

బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎదురులేకుండా పోయింది.

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు.. హ్యాట్రిక్ విజయం నమోదు
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎదురులేకుండా పోయింది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో భారత్ 110-100 తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు హాంకాంగ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. జోరు మీద ఉన్న ఆ జట్టు కూడా భారత్‌కు తీవ్ర పోటీనిచ్చింది. కానీ, భారత యువ షట్లర్లు తమ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థి ప్లేయర్లను నిలువరించారు. ఐదు మ్యాచ్‌‌లు ముగిసే సమయానికి భారత్ 55-49తో ఆధిక్యంలో నిలిచిన భారత్ ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ లీడ్‌ను కాపాడుకుని విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక, యూఏఈలపై నెగ్గడంతో భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. తాజా విజయంతో గ్రూపు డిలో టాప్ పొజిషన్‌లో నిలిచింది. సోమవారం క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌‌ను ఎదుర్కోనుంది.


Next Story