ఆసియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సత్తా.. సెమీస్‌కు దూసుకెళ్లిన వెన్నెల

by Harish |

బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం, హైదరాబాద్ అమ్మాయి కలగోట్ల వెన్నెల సత్తాచాటుతోంది.

ఆసియా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సత్తా.. సెమీస్‌కు దూసుకెళ్లిన వెన్నెల
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం, హైదరాబాద్ అమ్మాయి కలగోట్ల వెన్నెల సత్తాచాటుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వెన్నెల 21-18, 17-21, 21-17 తేడాతో థాయిలాండ్‌ షట్లర్ జన్యాపోర్న్ మీపన‌థోంగ్‌పై గెలుపొందింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో వెన్నెల విజయం కోసం శ్రమించాల్సి వచ్చింది. దాదాపు గంటపాటు చెమటోడ్చిన ఆమె మూడో గేములో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో యువ క్రీడాకారిణి తన్వి శర్మ కూడా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో ఇండోనేషియాకు చెందిన తలితా రామధాని విర్యావాన్‌పై 21-19, 21-14 తేడాతో నెగ్గింది. టోర్నీలో వెన్నెల, తన్వి మినహా మిగతా భారత షట్లర్లు ప్రీక్వార్టర్స్‌ను దాటలేకపోయారు. ఈ టోర్నీ చరిత్రలో ఇద్దరు భారత మహిళల సింగిల్స్ ప్లేయర్లు సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. సెమీస్‌లో ఇద్దరూ చైనా ప్లేయర్లనే ఎదుర్కోనున్నారు. యిన్ యి క్వింగ్‌తో తన్వి, లియు సి యాతో వెన్నెల పోటీపడనున్నారు.


Next Story