- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీక్ష, షైనా అదరహో.. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు కైవసం
అండర్-17, 15 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది.

దిశ, స్పోర్ట్స్ : అండర్-17, 15 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. చైనాలో జరిగిన టోర్నమెంట్‌లో భారత యువ క్రీడాకారిణులు దీక్ష సుధాకర్, షైనా మనిముత్తు అదరగొట్టారు. గర్ల్స్ సింగిల్స్ విభాగంలో అండర్-17 టైటిల్‌ను దీక్ష ఎగరేసుకపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో అండర్-17 విజేతగా నిలిచిన తొలి భారత సింగిల్స్ ప్లేయర్‌గా దీక్ష చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆమె మరో భారత యువ షట్లర్ లక్ష్య రాజేశ్‌పై గెలిచింది. 21-16, 21-9 తేడాతో విజయం సాధించింది. దీంతో దీక్ష స్వర్ణం కైవసం చేసుకోగా.. రన్నరప్ లక్ష్య రజతం దక్కించుకుంది. ఇక, షైనా అండర్-15 గర్ల్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్‌లో జపాన్‌కు చెందిన చిహారు టోమిటాను 21-14, 21-20 తేడాతో చిత్తు చేసింది. దీంతో వరుసగా రెండోసారి అండర్-15 గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను భారత్ నిలబెట్టుకుంది. సామియా ఫరూకీ(2017), తస్నిమ్ మిర్(2019), తన్వి పత్రి(2024) తర్వాత షైనా ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్య పతకాలతో భారత్ ఐదు మెడల్స్ దక్కించుకుంది.






