- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం RCB.. అప్పుడు కరోనా, ఇప్పుడు పాకిస్థాన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( RCB) బ్యాడ్ లక్ వెంటాడుతోంది. గత 17 సీజన్ లలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( RCB) బ్యాడ్ లక్ వెంటాడుతోంది. గత 17 సీజన్ లలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్ గా నిలువలేదు. అయితే ఈ 18వ సీజన్ లో కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... అదిరిపోయే పర్ఫామెన్స్ తో ప్లే ఆఫ్ దాకా వచ్చింది.
పాయింట్ల పట్టికలో ఒకానొక సమయంలో నెంబర్ వన్ పొజిషన్ లో కూడా ఉంది. దీంతో ఈసారి కప్పు కొడుతుందని అందరూ ఆశించారు. కానీ చివరికి... ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నిరవధికంగా వాయిదా పడింది. యుద్ధం ఆగిపోతే తప్ప ఈ టోర్నమెంట్ జరిగే పరిస్థితి లేదు. అయితే 2021 ఐపిఎల్ సమయంలో కూడా.. బెంగళూరును కరోనా ( Covid 19 ) మహమ్మారి వెంటాడింది.
2021 ఐపిఎల్ సమయంలో... ప్లేయర్ లందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. దీనితో కప్పు గెలుస్తుంది అన్న సమయంలోనే కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఐపిఎల్ ప్రారంభం అయ్యేసరికి ప్లేయర్లందరూ ఫామ్ కోల్పోయారు. ఇక ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో ఈసారి కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్ కాదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.






