పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాక్.. శ్రీలంకతో మ్యాచ్‌లో అలా చేసినందుకు ఫైన్

by Harish |

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాకిచ్చింది.

పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాక్.. శ్రీలంకతో మ్యాచ్‌లో అలా చేసినందుకు ఫైన్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాకిచ్చింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టినట్టు ఐసీసీ ధ్రువీకరించింది. ఈ నెల 16న జరిగిన మూడో వన్డేలో బాబర్ సెంచరీ బాది పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.అయితే,అతను అవుటైన తర్వాత వికెట్లను బ్యాటుతో కొట్టాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. క్రికెట్ వస్తువులను దుర్వినియోగం చేయడం నేరం. ఈ నేపథ్యంలోనే బాబర్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా, అతనికి ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. బాబర్ నేరాన్ని అంగీకరించినట్టు ఐసీసీ తెలిపింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను పాక్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.


Next Story