- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐసీసీ ర్యాంకింగ్స్ అదరగొట్టిన గిల్
శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను దాటేసి 680 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానికి చేరుకున్నాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్ అదరగొట్టిన గిల్
- వన్డేల్లో నంబర్ 1 స్థానంలో శుభ్‌మన్
- అగ్రస్థానం కోల్పోయిన బాబర్ అజామ్
- బౌలర్లలో టాప్ పొజిషన్‌లో మహీశ్ తీక్షణ
దిశ, స్పోర్ట్స్: భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించాడు. ఒక శతకం, రెండు అర్థ శతకాలతో భారత జట్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు గాను గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. కాగా కీలకమైన చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను దాటి గిల్ టాప్ ప్లేస్‌లోకి వెళ్లాడు. 796 రేటింగ్ పాయింట్లతో గిల్ నంబర్ 1 స్థానంలో ఉండగా.. 773 పాయింట్లతో బాబర్ అజామ్ రెండో స్థానంలో, 761 పాయింట్లతో రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టీమ్ ఇండియా మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 679 పాయంట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకొని తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు. వన్డేల్లో గిల్ నంబర్ 1 ర్యాంకును అందుకోవడం ఇది రెండో సారి. గతంలో 2023లో వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో కూడా బాబర్‌ను దాటేసి నంబర్ వన్ స్థానానికి వచ్చాడు.
ఇక శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను దాటేసి 680 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో రషీద్ ఖాన్ 669 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక స్థానం మెరుగు పరుచుకొని నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. కుల్దీప్ ఖాతాలో 652 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజీలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక భారత బౌలర్ మహ్మద్ సిరాస్ తన 10వ ర్యాంకును కాపాడుకున్నాడు.






