T20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్... షహాబాజ్ ఇన్

by Muthe.Rajitha |

ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

T20 సిరీస్ నుంచి అక్షర్ పటేల్ ఔట్... షహాబాజ్ ఇన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అనారోగ్య కారణాలతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను మూడో టీ20లో కూడా ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 17న లక్నో వేదికగా జరిగే నాలుగో మ్యాచ్‌, డిసెంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఐదో మ్యాచ్‌లలో ఆడబోడని ఉండడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. కాగా అక్షర్ స్థానంలో బెంగాల్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ షహబాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా vs సౌతాఫ్రికా మధ్య ఇప్పటికే మూడు T20 మ్యాచ్‌లు పూర్తవగా.. భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ గెలవాలంటే భారత్‌కు ఇంకో మ్యాచ్‌ గెలిస్తే చాలు.

Next Story