Champions Trophy 2025: ఇంగ్లండ్ బ్యాడ్‌లక్.. ఆస్ట్రేలియా భారీ విజయం

by Gantepaka Srikanth |

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్(Pakistan) లాహోర్‌ అంతర్జాతీయ మైదానం(Lahore International Ground) వేదికగా జరిగిన మ్యాచ్‌

Champions Trophy 2025: ఇంగ్లండ్ బ్యాడ్‌లక్.. ఆస్ట్రేలియా భారీ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా పాకిస్తాన్(Pakistan) లాహోర్‌ అంతర్జాతీయ మైదానం(Lahore International Ground) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌(England)పై ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. ఉత్కంఠ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ సొంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ప్లేయర్లు అదరగొట్టారు. బెన్ డకెట్ 165 పరుగులు చేసి అదరహో అనిపించారు. ఆ తర్వాత జో రూట్(68)తో పాటు మిగతా ప్లేయర్లు కూడా రాణించారు.

దీంతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి.. 351 పరుగులు చేశారు. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించారు. మాథ్యూ షార్ట్ (63), లబుషేన్ (47), జాన్ ఇంగ్లీస్ (120), అలెక్స్ క్యారీ (69), మ్యాక్స్‌వెల్ (32)లతో రాణించారు. దీంతో మొత్తంగా 47.3 ఓవర్లలో 5 వికెట్లు 356 పరుగులు చేశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బోణీ కొట్టగా, ఇంగ్లండ్‌ పరాజయంతో ప్రారంభించింది. సెమీస్ బరిలో నిలవాలంటే నెక్ట్స్ జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ తప్పకుండా గెలిచి తీరాలి.

Next Story