- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T20WorldCup2026: చివరి మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఆస్ట్రేలియా.. పసికూనపై ప్రతాపం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్‌తో శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ఒమన్‌తో శ్రీలంకలోని పల్లకీల మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (64*) హాఫ్ సెంచరీ సాధించగా.. ట్రావిస్ హెడ్ (32), జోష్ ఇంగ్లిస్ (12*) రాణించారు. ఒమన్ బౌలర్ షకీల్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 16.2 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 108 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బ కొట్టాడు. అతడితోపాటు గ్లెన్ మాక్స్‌వెల్ 2, బార్ట్‌లెట్ 2.. స్టాయినిస్, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో టీ20 ప్రపంచ కప్ 2026లో లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిశాయి. తన ఆఖరి మ్యాచ్‌లో విజయంతో ఈ టోర్నీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది.






