- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women's World Cup : బంగ్లాపై భారీ విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా
మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. టోర్నీలో వరుసగా నాలుగో విజయం నమోదు చేయడమే కాకుండా సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌కు చేరుకున్న తొలి జట్టు ఆసిసే. గురువారం విశాఖపట్నంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాను ఆసిస్ బౌలర్లు స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. బంగ్లా అతికష్టం మీద నిర్ణీత 50 ఓవర్లలో 198/9 స్కోరు చేసింది. శోభన(66 నాటౌట్) హాఫ్ సెంచరీతో పోరాడగా.. రుబియా హైదర్(44) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లు కనీస పోరాటం చేయలేక చేతులెత్తేశారు.
ఇక, 199 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించడం గమనార్హం. ఓపెనర్లే జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. అలీసా హీలీ మరోసారి సెంచరీ బాదింది. 77 బంతుల్లో 113 పరుగులతో అజేయంగా నిలిచింది. మరో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్(84 నాటౌట్) కూడా సత్తాచాటింది. దీంతో 24.5 ఓవర్లలో 202 రన్స్ చేసి విజయతీరాలకే చేరింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 10 వికెట్ల తేడాతో గెలవడం ఆసిస్‌కు ఇది 8వ సారి. ఇతర ఏ జట్టు కూడా మూడుసార్ల కంటే ఎక్కువసార్లు 10 వికెట్ల తేడాతో గెలవలేదు.






