- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia vs Pakistan : చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ ఓటమి
మహిళల వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో ఓటమిని ఎదుర్కొంది. కొలంబోలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసన ఆస్ట్రేలియా మహిళల జట్టులో బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. టాపార్డర్, మిడిలార్డర్ నిరాశపర్చిన వేళ ఆమె అసాధారణ పోరాటం చేసింది. శతకంతో రెచ్చిపోయిన మూనీ 114 బంతుల్లో 109 రన్స్ చేసి అవుటైంది. ఆమె తర్వాత అలానా కింగ్(51 నాటౌట్) మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. 11వ స్థానంలో క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీతో రాణించడం విశేషం. ఆమె పోరాటంతోనే ఆసిస్ 221/9 స్కోరు చేయగలిగింది. ఇక, ఛేదనలో పాక్ జట్టు దారుణంగా చేతులెత్తేసింది. సిడ్రా అమిన్(35) కాస్త పర్వాలేదనిపించగా..మిగతా వారిలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు. దీంతో పాక్ 36.3 ఓవర్లలోనే 114 పరుగులే చేసి ఆలౌటవడంతో ఘోర ఓటమి పాలైంది. ఆసిస్ బౌలర్లలో కిమ్ గార్త్ 3 వికెట్లు, మేఘాన్ షుట్, సుదర్లాండ్ చెరో 2 వికెట్లతో పాక్‌ను కూల్చేశారు. టోర్నీలో ఆసిస్‌కు ఇది రెండో విజయం.






