- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దూబే భారీ సిక్స్..స్టేడియం బయటపడ్డ బంతి..టీమిండియా స్కోర్ ఎంతంటే ?
నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 8 వికెట్లు నష్టపోయి కేవలం 167 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఈ మ్యాచ్ లో 168 పర

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరిగిన 4వ టీ20లో సూర్య కుమార్ సేన పడుతూ, లేస్తూ ఆడింది. మొదట్లో 50 పరుగుల వరకు ఒక్క వికెట్ పడకుండా ఆడిన టీమిండియా ఆ తర్వాత, వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన టీమిండియా, 8 వికెట్లు నష్టపోయి కేవలం 167 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఈ మ్యాచ్ లో 168 పరుగులు చేస్తే కంగారులదే విజయం అన్న మాట.
దూబే భారీ సిక్స్.. స్టేడియం బయటపడ్డ బంతి
ఆస్ట్రేలియా తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ కు వచ్చిన శివమ్ దుబే మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లోనే 22 పరుగులు సాధించి కంగారులకు చుక్కలు చూపించాడు. ఇందులో ఒక బౌండరీ తో పాటు ఒక సిక్సర్ కూడా ఉంది. అయితే ఆడమ్ జంపా బౌలింగ్ లో శివం దుబే కళ్ళు చెదిరే సిక్స్ కొట్టేశాడు. దీంతో బంతి స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఈ నేపథ్యంలోనే కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో గిల్ టచ్ లోకి వచ్చాడు. 46 పరుగులు చేసి రాణించాడు. అటు అభిషేక్ శర్మ 28 పరుగులు, సూర్య 20 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చివరలో అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. క్లిక్






