- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ ఓడిన టీమిండియా...వన్డే సిరీస్ ఫ్రీగా ఎలా చూడాలంటే ?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వన్డేలో కంగారులు టాస్ నెగ్గారు. ఈ నేపథ్యంలో మొదట బౌలింగ్

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న పెర్త్ వన్డేలో కంగారులు టాస్ నెగ్గారు. ఈ నేపథ్యంలో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆసీస్ జట్టు. కంగారులు టాస్ నెగ్గడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో మొదట బౌలింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ జరగగా, మరికొన్ని క్షణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగునున్న ఈ వన్డే సిరీస్ ను జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు.
స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు అందిస్తున్నారు. ఈ తొలి వన్డే మ్యాచ్ తో వన్డే ఫార్మాట్ లోకి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్, కోహ్లీ ఇద్దరూ 7 నెలల తర్వాత టీమిండియా జెర్సీలో మెరుస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ వన్డేలలో రోకో కాంబో అదరగొడుతుందని అంచనా వేస్తున్నారు. మరి వీళ్లు ఎలా ఆడతారో చూడాలి.






