అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం

by Gantepaka Srikanth |

ముంబై(Mumbai) వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత(Team India) బౌలర్లు తడబడ్డారు.

అత్యంత కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై(Mumbai) వేదికగా ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత(Team India) బౌలర్లు తడబడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు అదరగొట్టారు. భారత జట్టు ఎదుట భారీ టార్గెట్ పెట్టారు. 50 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేశారు. ఆసిస్ బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ (77), లిచ్‌ఫీల్డ్‌ (117), గార్డ్‌నర్ (63) పరుగులతో రాణించడంతో ఆసిస్ భారీ స్కోరు చేయగలిగారు. భారత బౌలర్లో శ్రీచరణి రెండు వికెట్లు, క్రాంతి, కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. కాగా, ప్రపంచకప్‌‌లో గ్రూప్‌ దశలో ఓ మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్‌ బెర్తు సాధించిన భారత జట్టు.. అష్టకష్టాలు పడి సెమీస్‌కు చేరింది. తీరా సెమీ ఫైనల్‌లోనూ బౌలర్లు విఫలం కావడంతో ఆసిస్ బ్యాటర్లు కొండంత టార్గెట్‌ను నిర్దేశించారు. సమిష్టిగా రాణిస్తే విజయం ఖాయమని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ఆడి కంగారూలపై పైచేయి సాధించాలని ఆశిస్తున్నారు.

Next Story