- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy: మూడు మ్యాచుల్లో వరుణుడిదే విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy, 2025)లో భాగంగా పాకిస్తాన్‌లోని లాహోర్ వేదికగా జరిగే ఆఫ్ఘనిస్తాన్(Afghanistan), ఆస్ట్రేలియా(Australia) మ్యాచ్ రద్దయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy, 2025)లో భాగంగా పాకిస్తాన్‌లోని లాహోర్ వేదికగా జరిగే ఆఫ్ఘనిస్తాన్(Afghanistan), ఆస్ట్రేలియా(Australia) మ్యాచ్ రద్దయింది. సెకండ్ ఇన్సింగ్ మొదలైన 12 ఓవర్లకే వర్షం ప్రారంభం కావడంతో అనివార్య పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. మొత్తం నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరింది. మరోవైపు.. పాకిస్తాన్‌లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ వేదికగా ఐసీసీ టోర్నమెంట్ నిర్వహిస్తే మూడు మ్యాచుల్లో వరుణుడు పైచేయి సాధించాడని ట్రోల్స్ చేస్తున్నారు. నిన్న ఒక్క బంతి కూడా పడకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కాగా, ఇవాళ ఆట మధ్యలో వర్షం పడటంతో ఆసిస్, ఆఫ్ఘన్ మ్యాచ్ రద్దయింది. దీంతో పాకిస్తాన్‌లో జరిగిన మూడు ప్రతిష్టాత్మక మ్యాచుల్లో వరుణుడే గెలుపొందాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఆటకు ఆటంకం కలిగే సమయానికి ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 37.1 ఓవర్లలో 165 పరుగులు అవసరం. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ 59, స్టీవ్ స్మిత్ 19 పరుగుల మీద ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆప్ఘాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 67, ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 22 చొప్పున పరుగులు చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా, రహ్మత్ షా 12, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 20, మహ్మద్ నబీ 1, రషీద్ ఖాన్ 19 చొప్పున పరుగులు చేశారు.






