టీ20 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా ఔట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-17 12:27:36  IST  )

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో సంచలనం చోటుచేసుకుంది. తొలిసారి గ్రూప్ దశ నుంచి ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది.

టీ20 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌(ICC Men's T20 World Cup 2026) చరిత్రలో సంచలనం చోటుచేసుకుంది. తొలిసారి గ్రూప్ దశ నుంచి ఆస్ట్రేలియా జట్టు టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది. ఇవాళ బింబాబ్వే, ఐర్లాండ్(Ireland vs Zimbabwe) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఆ రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివవరకు ఆడిన మూడు మ్యాచుల్లో బింబాబ్వే జట్టు రెండింట్లో విజయం సాధించింది. మరోవైపు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో కనీసం సూపర్-8కి చేరకుండానే ఈసారి ఆస్ట్రేలియా జట్టు ఇంటి ముఖం పట్టింది.

సూపర్-8కి చేరిన జట్లు :

ఆడిన మూడు మ్యాచులూ గెలిచిన భారత్‌ (Team India) ఇప్పటికే సూపర్‌ 8కి క్వాలిఫై అయింది. గ్రూప్‌ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక సూపర్‌ 8కి అర్హత సాధించింది. గ్రూప్‌ Cలో మూడింట మూడు మ్యాచ్‌లు నెగ్గి వెస్టిండీస్‌, నాలుగులో మూడు నెగ్గిన ఇంగ్లాండ్‌ సూపర్‌ 8కి క్వాలిఫై అయ్యాయి. గ్రూప్‌ Dలో మూడు మ్యాచ్‌లూ నెగ్గిన దక్షిణాఫ్రికా సూపర్‌ 8కి క్వాలిఫై అయింది. టోర్నీ నుంచి నేపాల్‌, ఇటలీ, స్కాట్లాండ్‌, అఫ్ఘానిస్థాన్‌, యూఏఈ, కెనడా జట్లు టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయిపోయాయి.

Next Story