- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా, విండీస్ మ్యాచ్‌లో ఒకే రోజు 15 వికెట్లు
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో బౌలర్ల ప్రతాపం కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : జమైకాలోని కింగ్‌స్టన్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో బౌలర్ల ప్రతాపం కొనసాగుతోంది. తొలి రోజు 11 వికెట్లు పడగా.. రెండో రోజైన సోమవారం ఏకంగా 15 వికెట్లు పడ్డాయి.మొదటి రోజు ఆసిస్ 225 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో రోజు ముందుగా ఓవర్‌నైట్ స్కోరుతో 16/1తో ఆట కొనసాగించిన కరేబియన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. విండీస్ జట్టులో ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు. కాంప్‌బెల్(36) టాప్ స్కోరర్. బోలాండ్ 3 వికెట్లు, హాజెల్‌వుడ్, కమిన్స్ చెరో 2 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్‌కు 82 పరుగుల విలువైన ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసిస్ కూడా తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది. గ్రీన్(42), కమిన్స్(5) ఉన్నారు. ఆసిస్ 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తిగా బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఆసిస్ 200 లక్ష్యం పెట్టినా విండీస్‌కు కొండంతే. ఇప్పటికే రెండు టెస్టులు నెగ్గి సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకున్న ఆసిస్ మూడో టెస్టులోనూ గెలిస్తే సిరీస్ క్లీన్‌స్వీప్ అవుతుంది.
- Tags
- aus vs wi






