- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTC ఫైనల్‌కు జట్టను ప్రకటించిన ఆస్ట్రేలియా
జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పూర్తవ్వగానే.. మరో కీలక టోర్నీ ఫైనల్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జూన్ నెలలో జరగనుంది. ఫైనల్ మ్యాచుకు ఆస్ట్రేలియా తో పాటు సౌతాఫ్రికా చేరుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పూర్తవ్వగానే.. మరో కీలక టోర్నీ ఫైనల్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (World Test Championship) మ్యాచ్ జూన్ నెలలో జరగనుంది. ఫైనల్ మ్యాచుకు ఆస్ట్రేలియా (Australia) తో పాటు సౌతాఫ్రికా చేరుకున్నాయి. వచ్చే నెల లార్డ్స్ (Lord's)లో జరిగే WTC ఫైనల్స్ జరగనుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచుకు ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. జట్టులో పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్ లకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, జోస్ హెన్జిల్‌ఉండ్ ఐపీఎల్ తర్వాత జట్టులోకి తిరిగి అవకాశం దక్కింది. మొత్తం 15 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించారు. కాగా ఈ ఫైనల్ మ్యాచు (Final match)లో ఆస్ట్రేలియా గెలిస్తే కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్ (Pat Cummins) చరిత్ర సృష్టించనున్నారు.






