- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో సిరీస్‌కు జట్లను ప్రకటించిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ జట్లను ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ జట్లను ప్రకటించింది. ఈ నెల అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో పేసర్ మిచెల్ స్టార్‌క్, ఓపెనర్ మాథ్ షార్ట్‌లకు తుది జట్టులో చోటు లభించింది. గత నెల టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించిన స్టార్క్.. ఈ సారి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. గాయంతో దూరమైన కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించనున్నాడు. మరోవైపు, మాథ్యూ రెన్షా, మిచెల్ ఓవెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
అయితే ఆరోన్ హార్డీ, మాథ్యూ క్యూనెమన్, మార్నస్ లబుషేన్ ఈ సారి జట్టులో లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వన్డే సిరీస్ తర్వాత అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల కోసం కూడా 14 మందితో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. అందులో నాథన్ ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్‌లు తిరిగి జట్టుకు ఎంపికయ్యారు. ఎంపికల కమిటీ చైర్మన్ జార్జ్ బైలీ మాట్లాడుతూ, “వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించాం. టీ20 ప్రపంచకప్, అలాగే టెస్ట్ సీజన్ సిద్ధతను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చామని ప్రకటించారు.
ఆస్ట్రేలియా వన్డే జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జావియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానెల్లీ, బెన్ డ్వార్ష్యూస్, నాథన్ ఎల్లిస్, క్యామెరన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్ షార్ట్, మిచెల్ స్టార్‌క్, ఆడమ్ జాంపా
ఆస్ట్రేలియా టీ20 జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబ్బాట్, జావియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్ష్యూస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ క్యూనెమన్, మిచెల్ ఓవెన్, మాథ్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా






