డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా సిద్ధం.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇవే..!

by Phanindra |

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. రెండు జట్లు తమ ప్లేయింగ్ 11 కూడా ప్రకటించేశాయి!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంతా సిద్ధం.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇవే..!
X

దిశ, స్పోర్ట్స్: టెస్టుల్లో కింగ్ ఎవరో తేల్చే టైం వచ్చేసింది. సుదీర్ఘ ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అంతా రెడీ అయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి సత్తా చాటాలని అనుకుంటుంటే.. తొలి ఐసీసీ ట్రోఫీ సాధించాలని సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ కీలక మ్యాచులో ఆడే జట్లను కూడా ఈ రెండు టీమ్స్ ఇప్పటికే ప్రకటించేశాయి కూడా. మార్నస్ లబుషేన్‌తో ఓపెనింగ్ చేయించాలని డిసైడ్ అయిన కమిన్స్ సేన.. బోలాండ్ స్థానంలో హేజిల్‌వుడ్‌ను ఆడించాలని నిర్ణయించింది. అదే సమయంలో ఫామ్‌లో ఉన్న డేన్ పాటర్సన్‌ను కాదని లుంగి ఎన్గిడీని ఆడించాలనే డెసిషన్ తీసుకున్నాడు సఫారీ సారధి టెంబా బవుమా.

ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్

సౌతాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, ట్రిస్టియన్ స్టబ్స్, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హం, కైల్ వెరెనీ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడీ

Next Story