- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 ఫీట్లు ఉంటాడు కానీ..ఆస్ట్రేలియాను వణికిస్తున్నాడు..అతని రికార్డులు చూస్తే...!
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఆస్ట్రేలియా ఆటగాళ్లను గజగజ వనికిస్తున్నాడు సౌత్

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఆస్ట్రేలియా ఆటగాళ్లను గజగజ వనికిస్తున్నాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (Temba Bavuma).. అతను ఉన్నది 4 ఫీట్లు అయినా కూడా... ఆస్ట్రేలియా ప్లేయర్లు నిద్రపోకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని గత రికార్డులు పరిశీలిస్తే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
టెంబా బావుమా కెప్టెన్సీలో ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా (South Africa) టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలిచేసింది. అంటే ఈ లెక్కన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( World Test Championship Final 2025) కూడా... ఆస్ట్రేలియాపై (Australia ) సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు పెడుతున్నారు. ఒక వేళ అదే జరిగితే... సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టిస్తుంది.
ఆస్ట్రేలియాలో (Australia ) డేంజర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... టెంబా బావుమా ఉన్నంతసేపు ఎవరు ఏం పీకలేరని.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 మ్యాచ్ జూన్ 11వ తేదీన అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అంటే జూన్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ వేదికగా నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.






