- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC Final: కోహ్లీ, రోహిత్ ప్లేయర్ల పరువు తీసిన ఆస్ట్రేలియా బౌలర్..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ( Test Championship 2025 Final) మ్యాచ్ తుది దశకు వచ్చేసింది. మరో 69 పరుగులు చేస్త

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ( Test Championship 2025 Final) మ్యాచ్ తుది దశకు వచ్చేసింది. మరో 69 పరుగులు చేస్తే... ఆస్ట్రేలియాపై ( Australia) గెలిచి ఛాంపియన్ గా నిలుస్తుంది సౌత్ ఆఫ్రి కా ( South Africa). మరో రెండు రోజుల సమయం... అదే సమయంలో 8 వికెట్లు సౌత్ ఆఫ్రికా చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కచ్చితంగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా టాపార్డర్ మొత్తం రెండవ ఇన్నింగ్స్ లో కుప్పకూలితే... బౌలర్ మిచెల్ స్టార్క్ కు మాత్రం అద్భుతంగా రాణించాడు. 136 బంతుల్లో 58 పరుగులు చేసి... చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన బౌలర్ గా నిలిచాడు మిచెల్ స్టార్క్. అతను హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా... టీమిండియా స్టార్ ఆటగాళ్ల పరువు మొత్తం తీసేసాడు.
WTC ఫైనల్స్ లో ఇప్పటి వరకు టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు ఎవరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. గిల్, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ, పూజార ఇలా ఎవరు చేయని హాఫ్ సెంచరీ మిచెల్ స్టార్క్ సాధించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇండియా పరువు పోతుందని... కోహ్లీ అలాగే విరాట్ కోహ్లీని ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. ఓ బౌలర్ కొట్టిన పరుగులు కూడా మీరు కొట్టరా..? మీరెందుకు ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 13, 2025






