AUS VS SA 2nd Test : సిరీస్ ఆస్ట్రేలియాదే

by Disha Web Desk 4 |
AUS VS SA 2nd Test : సిరీస్ ఆస్ట్రేలియాదే
X

దిశ, వెబ్ డెస్క్: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుసగా రెండు టెస్ట్ మ్యాచుల్లో గెలిచి ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 189 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 575/8 వద్ద డిక్లేర్ చేసింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 204 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్ గ్రీన్ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను దెబ్బతీశాడు. స్టార్క్ 2 వికెట్లు తీయగా, బొలాండ్ , లియాన్ చెరో వికెట్ తీశారు. ఎల్గర్ రనౌట్‌గా వెను దిరిగాడు.

Also Read...

భారత జట్టులో ఎంపిక కాకపోవడంపై జెమిమా రోడ్రిగ్స్ షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed