- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెలరేగిన భారత బౌలర్లు.. 236 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డే (third ODI)లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫీల్డింగ్ కు దిగిన భారత బౌలర్లు.. ఆస్ట్రేలియాపై రెచ్చిపోయారు. మొదట ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మార్ష్ కొద్ది సేపు నిలకడగా రాణించారు. 61 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్ హెడ్ రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత 88 పరుగులకు 2వ వికెట్, 124 పరుగులకు 3వ, 183 పరుగులకు 4వ, 195 పరుగులకు 5వ, 198 పరుగులకు 6వ, 201 పరుగులకు 7వ, 223 పరుగుల వద్ద 8, 236 వద్ద, 9, 10 వ వికెట్లు పడిపోయాయి. ఈ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షావ్ 56, అలెక్స్ కేరీ 24, కాన్లే 23 పరుగులు చేశారు. 46. 4 ఓవర్లలో ఆస్ట్రేలియా కేవలం 236 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 , సుందర్ 2 వికెట్లు తీసుకొగా.. సిరాజ్, ప్రసిద్ధి కృష్ణా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే 50 ఓవర్లకు 237 పరుగులు చేయాల్సి ఉంది.






