- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు రెండో వన్డే అడిలైడ్ వేదికగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు రెండో వన్డే అడిలైడ్ వేదికగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ మ్యాచులో అయిన తిరిగి ఫామ్ లోకి వస్తారని వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా కెప్టెన్ గిల్.. తన సేనతో రంగంలోకి దిగాడు. కానీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఈ మ్యాచులో ముగ్గురు ప్లేయర్లను మార్చి షాక్ ఇచ్చింది. జట్టులోకి కారీ, బార్ట్‌లెట్, జంపా లను తీసుకొగా.. ఫిలిప్, ఎల్లిస్, కుచ్‌నెమాన్ లను బయటకు పంపింది. మరి ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
READ MORE ...






