ATP Rankings: జకోవిచ్‌ను వెనక్కినెట్టి అల్కరాజ్.. మెన్స్ సింగిల్స్‌లో తిరిగి అగ్రస్థానం

by Disha Web Desk 13 |
ATP Rankings: జకోవిచ్‌ను వెనక్కినెట్టి అల్కరాజ్.. మెన్స్ సింగిల్స్‌లో తిరిగి అగ్రస్థానం
X

న్యూఢిల్లీ : స్పెయిన్ టెన్నిస్ యువ సంచలనం, యూఎస్ ఓపెన్ చాంపియన్‌ కార్లోస్ అల్కరాజ్ తిరిగి అగ్రపీఠం దక్కించుకున్నాడు. మెన్స్ ఫ్రొఫెషనల్ టెన్నిస్ గవర్నింగ్ బాడీ ఏటీపీ సోమవారం విడుదల చేసిన మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను వెనక్కినెట్టి అల్కరాజ్ వరల్డ్ నం.1 ర్యాంక్‌ను సాధించాడు. ఆదివారం అల్కరాజ్ క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్‌లో అల్కరాజ్ 6-4, 6-4 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన డి మినార్‌ను ఓడించాడు.

దాంతో ఈ సీజన్‌లో ఐదో టైటిల్ నెగ్గిన అల్కరాజ్ తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 500 పాయింట్స్‌తోపాటు ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని టాప్ పొజిషన్‌కు చేరాడు. దాంతో జకోవిచ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ నెలలో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడం ద్వారా జకోవిచ్.. అల్కరాజ్‌ను వెనక్కినెట్టి అగ్రపీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, రెండు వారాల వ్యవధిలోనే అల్కరాజ్ తిరిగి జకోవిచ్ నుంచి వరల్డ్ నం.1 ర్యాంక్‌ను చేజిక్కించుకున్నాడు.



Next Story