- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్ట్‌లో హ్యాట్రిక్ నమోదు.. 14వ ఇంగ్లాండ్ బౌలర్‌గా అట్కిన్‌సన్ రికార్డు
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్‌సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్‌సన్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. తద్వారా టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 14 ఇంగ్లాండ్ బౌలర్‌గా నిలిచాడు. శనివారం న్యూజిలాండ్‌తో వెల్లింగ్‌టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు అట్కిన్‌సన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి సెషన్ సందర్భంగా 34వ ఓవర్‌లో బాల్ అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ స్మిత్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీలను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఇక రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ గెలుపు దిశగా సాగుతోంది. జాకబ్ బెథెల్(96), బెన్ డకెట్(92)లు రాణించడంతో 533 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 125 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 378 పరుగులు చేసింది. రూట్(73), బెన్ స్టోక్స్(35) క్రీజులో ఉన్నారు.






