100 మీటర్ల రేసులో గురిందర్‌వీర్ జాతీయ రికార్డు

by Harish |

పంజాబ్ అథ్లెట్, 24 ఏళ్ల స్ప్రింటర్ గురిందర్‌వీర్ 100 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు.

100 మీటర్ల రేసులో గురిందర్‌వీర్ జాతీయ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ అథ్లెట్, 24 ఏళ్ల స్ప్రింటర్ గురిందర్‌వీర్ 100 మీటర్ల రేసులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 1లో అతను నేషనల్ రికార్డు సాధించాడు. 100 మీటర్ల రేసును 10.20 సెకన్లలో పూర్తి చేశాడు. 2023 అక్టోబర్‌లో మణికంఠ హోబ్లిధర్ నెలకొల్పిన 10.23 సెకన్ల నేషనల్ రికార్డు‌ను గురిందర్‌వీర్ సింగ్ బద్దలుకొట్టాడు. ఈ ప్రదర్శన కంటే ముందు అతనికి 2021లో 10.27 సెకన్లు పర్సనల్ బెస్ట్‌గా ఉండేది. తాజా ఈవెంట్‌ ఫైనల్‌లో గురింద‌‌ర్‌వీర్, హోబ్లిదర్ స్వర్ణ పతకం కోసం పోటీపడ్డారు. గురిందర్‌వీర్ 10.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కొత్త జాతీయ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం సాధించాడు. హోబ్లిదర్ 10.22 సెకన్లతో రెండో స్థానంలో నిలువగా.. ఆమ్లాన్ బోర్గోహైన్ 10.43 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గురిందర్‌వీర్ సింగ్ 2021, 2024 నేషనల్ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌తోపాటు 2024 ఫెడరేషన్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.


Next Story