- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neeraj Chopra: ప్రధాని మోడీని కలిసిన అథ్లెట్ నీరజ్ చోప్రా దంపతులు
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భార్య హిమాని మోర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన భార్య హిమాని మోర్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం కలిశారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడలతో పాటు పలు అంశాలపై సానుకూలంగా చర్చ జరిగినట్లు ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘ఈ రోజు నీరజ్ చోప్రా, ఆయన భార్య హిమాని మోర్‌ను కలిశాను. క్రీడలు సహా వివిధ అంశాలపై మంచి చర్చ జరిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత క్రీడలకు నీరజ్ చోప్రా చేసిన సేవలను ప్రధాని అభినందించగా, భవిష్యత్‌లో దేశానికి మరిన్ని ఘన విజయాలు అందించాలని ఆకాంక్షించారు. కాగా, ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






