ఆసియా షూటింగ్‌లో సిఫ్ట్ కౌర్ సంచలనం.. రెండు స్వర్ణ పతకాలు కైవసం

by Harish |

ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా షూటర్ సిఫ్ట్ కౌర్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది.

ఆసియా షూటింగ్‌లో సిఫ్ట్ కౌర్ సంచలనం.. రెండు స్వర్ణ పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా షూటర్ సిఫ్ట్ కౌర్ అదరగొట్టింది. కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో వ్యక్తిగత ఈవెంట్‌తోపాటు టీమ్ ఈవెంట్‌లోనూ సత్తాచాటింది. రెండు గోల్డ్స్ మెడల్స్ కైవసం చేసుకుంది. వ్యక్తగత ఈవెంట్‌లో ఆమె 459.2 స్కోరుతో చైనా, జపాన్ షూటర్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. టీమ్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్, ఆషి, అంజుమ్‌లతో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. భారత త్రయం 1,753 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో అనీష్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు 862 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచింది.

మరోవైపు, టోర్నీలో జూనియర్ షూటర్ల హవా కొనసాగుతోంది. యువ షూటర్ అనుష్క కూడా వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో 460.7 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ప్రాచి గైక్వాడ్, మోహిత్ సందు‌లతో కలిసి అనుష్క 1,758 స్కోరుతో టైటిల్ టైటిల్ గెలిచింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణం, రజతం భారత్‌ ఖాతాలోనే చేరాయి. సబీర హరీస్(39 స్కోరు) గోల్డ్ మెడల్ గెలువగా.. కత్యాల్ ఆద్య(38) రజతంసాధించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో త్యాగి ఆర్య వన్ష్ తృటిలో స్వర్ణం కోల్పోయాడు. షూటౌట్‌లో వెనుకబడి రజతంతో సరిపెట్టాడు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో సమీర్(21 స్కోరు) బ్రాంజ్ మెడల్ సాధించాడు. భారత్ పతకాల సంఖ్య 70కి చేరగా..మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


Next Story