- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా షూటింగ్‌లో గుర్‌ప్రీత్‌కు రెండు స్వర్ణాలు.. తెలంగాణ షూటర్లకు కూడా గోల్డ్ మెడల్
కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ గుర్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ గుర్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. గురువారం 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో రెండు బంగారు పతకాలు(వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో) కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం, రజతం భారత్ ఖాతాలోనే చేరాయి. గుర్‌ప్రీత్ 572 స్కోరుతో విజేతగా నిలిచాడు. మరో భారత షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ కూడా 572 స్కోరు చేశాడు. కానీ, గుర్‌ప్రీత్ కంటే అతని కంటే సెంటర్ స్పాట్(x) వద్ద ఎక్కువసార్లు షూట్ చేయడంతో అగ్రస్థానం దక్కింది. దీంతో అమన్‌ప్రీత్ రెండో స్థానంలో రజతంతో సరిపెట్టాడు.
ఇక, టీమ్ ఈవెంట్‌లో గుర్‌ప్రీత్, అమన్‌ప్రీత్, హర్ష్ గుప్తా కలిసి 1,709 స్కోరుతో గోల్డ్ మెడల్ గెలిచారు. ఇదే ఈవెంట్‌లో జూనియర్ విభాగంలో కూడా స్వర్ణం భారత్‌కే దక్కింది. సూరజ్ శర్మ, మురళీధర్ నాయుడు, ముకేశ్ నేలవల్లిలతో కూడిన భారత జట్టు 1,703 స్కోరుతో టైటిల్ కైవసం చేసుకుంది. మురళీధర్, ముకేశ్ తెలంగాణకు చెందిన షూటర్లు కావడం విశేషం. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో సూరజ్(571) రజతం సాధించగా.. మురళీ ధర్(568) కాంస్యం గెలిచాడు. ఇక, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ ఈవెంట్‌లో సామ ఉల్లా ఖాన్, ఆడ్రియన్ కర్మాకర, కుషాగ్రా సింగ్ త్రయం(1,844) విజేతగా నిలిచింది. టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 82కు చేరింది. 44 స్వర్ణాలు, 20 రజతాలు, 18 కాంస్య పతకాలతో మెడల్ టేబుల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కజకిస్థాన్(59), చైనా(37) రెండు, మూడు స్థానాలో ఉన్నాయి.






