- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ హవా.. ఎలవెరిన్-అర్జున్ జోడీకి స్వర్ణం
ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో వలరివన్ ఎలవెనిల్-అర్జున్ బబుటా జోడీ బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఈ జంట 17-11 తేడాతో చైనాకు చెందిన పెంగ్ జిన్లు, డింగ్కే లులను ఓడించారు. ఈ టోర్నీలో ఎలవెనిల్‌కు ఇది రెండో స్వర్ణం. శుక్రవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తంగా ఆమెకు ఇది ఈ టోర్నీలో మూడో పతకం. అలాగే, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రుద్రాంక్ష్ పాటిల్, కిరణ్ జాదవ్‌లతో కలిసి స్వర్ణం గెలిచిన అర్జున్‌కు కూడా ఇది రెండో గోల్డ్ మెడల్. మరోవైపు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ జూనియర్ విభాగంలో కూడా గోల్డ్ మెడల్ మనకే దక్కింది. యువ షూటర్లు శాంభవి, నరేన్ ప్రణవ్ విజేతగా నిలిచారు. ఫైనల్‌లో ఈ భారత జంట 16-12 తేడాతో చైనాకు చెందిన టాంగ్ హుయికి-హన్ యినాన్ ద్వయంపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ 41 పతకాలతో మెడల్ టేబుల్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అందులో 23 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత్ అగ్రస్థానంలో ఉండగా చైనా 19 మెడల్స్‌తో రెండో స్థానంలో ఉంది.






