ఆసియా షూటింగ్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌కు రజతం

by Harish |

ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు.

ఆసియా షూటింగ్‌లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్‌కు రజతం
X

దిశ, స్పోర్ట్స్ : కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. తెలుగమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ టీమ్ ఈవెంట్‌లో పతకం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా, పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ మను భాకర్, సిమ్రా‌న్‌ప్రీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. భార జట్టు 871 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. చైనా జట్టు 874 స్కోరుతో స్వర్ణం గెలువగా.. కజకిస్థాన్(868) కాంస్యం సాధించింది.

ఇక, భారత షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ అదరగొట్టాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత ఈవెంట్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. ఫైనల్‌లో అతను 462.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే, టీమ్ ఈవెంట్‌‌లోనూ రజతం సాధించాడు. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ చైన్ సింగ్, అఖిల్ త్రంయ 1,747 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లోనూ భారత్‌కు స్వర్ణం దక్కింది. ఆషిమా ఆహ్లావత్, నీరు, ప్రీతి రజక్‌లు 125 స్కోరుతో విజేతగా నిలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ జూనియర్ విభాగంలో తేజస్విని, కుల్దీప్ ఖత్రి పాయల్, రియా శిరీష్‌లతో కూడిన భారత జట్టు 831 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. దీంతో టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 46కు చేరింది. అందులో 26 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. మెడల్ టేబుల్‌లో భారత్ టాప్ పొజిషన్‌లో ఉండగా చైనా(23) రెండో స్థానంలో ఉంది.


Next Story