- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : మంగోలియాలో జరుగుతున్న ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ విశ్వనాథ్ సురేశ్ అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఏకంగా వరల్డ్ చాంపియన్‌కే షాకిచ్చాడు. 50 కేజీల కేటగిరీలో పాల్గొన్న విశ్వనాథ్ ఆ కేటగిరీలో వరల్డ్ నం.1 అయిన కజకస్థాన్‌కు చెందిన సంజార్ తాష్కెన్‌బేను మట్టికరిపించాడు. 5-0తో ఏకపక్ష విజయం సాధించాడు. దీంతో సెమీస్‌లో అడుగుపెట్టడమే కాకుండా పతకాన్ని కూడా ఖాయం చేసుకున్నాడు. మరో భారత బాక్సర్ నరేందర్ కూడా సెమీస్‌కు పతకం ఖాయం చేసుకున్నాడు. పురుషుల 90+ కేజీల కేటగిరీలో నరేందర్ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో 5-0 తేడాతో యూఏఈ బాక్సర్ ఓర్ఖాన్ అఘాయేవ్‌పై గెలుపొందాడు. ఇక అంకుషిత మహిళల 65 కేజీల కేటగిరీలో సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో కజకస్థాన్‌కు చెందిన యెస్సెంకెల్డిని 4-1తో చిత్తు చేసి పతకం ఖరారు చేసుకుంది. శుక్రవారం నిఖత్ జరీన్, ప్రియా ఘంఘాస్, ప్రీతి పవార్ కూడా సెమీస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.






