- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BCCI : ఆసియా కప్ వార్తలు అవాస్తవం : బీసీసీఐ క్లారిటీ
ఆసియా కప్(Asia Cup 2025) లో టీం ఇండియా పాల్గొనబోవడం లేదనే వార్తల్లో నిజం లేదని బీసీసీఐ(BCCI) బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా(Devajit Saikia) క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్(Asia Cup 2025) లో టీం ఇండియా పాల్గొనబోవడం లేదనే వార్తల్లో నిజం లేదని బీసీసీఐ(BCCI) బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా(Devajit Saikia) క్లారిటీ ఇచ్చారు. సోమవారం పలు వార్తా సంస్థల్లో వచ్చిన న్యూస్ అవాస్తవం అని పేర్కొన్న దేవజిత్ సైకియా.. టీం ఇండియా ఆసియా కప్ 2025 లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుందని వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని, బీసీసీఐ ఇప్పటివరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) ఈవెంట్‌ల గురించి ఎలాంటి చర్చలు జరపలేదని, ఏ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2025(IPL 2025), ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌పై మాత్రమే దృష్టి సారించిందని.. ఆసియా కప్ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.
ఏసీసీ ఈవెంట్‌లపై భవిష్యత్తులో చర్చలు జరిగినప్పుడు తగిన సమయంలో ప్రకటన విడుదల చేస్తామని సైకియా పేర్కొన్నారు. ఈ విషయంలో వచ్చిన ఊహాగానాలు, ఊహాజనిత వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. భారత్ లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ తో అన్ని సంబంధాలను తెంచుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ గా పాకిస్తాన్ కు చెందిన మోహిన్ నఖ్వీ ఉండటం చేత.. ఈ టోర్నీకి భారత్ దూరంగా ఉండబోతోంది అనే వార్తలు హాల్ చల్ చేశాయి. తాజాగా ఈ న్యూస్ పై బీసీసీఐ క్లారిటీ ఇవ్వడంతో అన్నిరకాల ఊహాగానాలకు తెరపడినట్లైంది






