- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asia Cup : భారత్, పాక్ మ్యాచ్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుందా? లేదంటే మ్యాచ్‌ను బహిష్కిస్తుందా?..క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న ఇదే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దన్న డిమాండ్ తీవ్రమైంది. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశం కంటే ఒక్క మ్యాచ్ ఎక్కువేం కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసియా కప్‌లో దాయాదుల పోరుపై సందిగ్ధం నెలకొంది. ఆసియా కప్‌లో పాల్గొనడం, పాక్‌తో ఆడటం ఆటగాళ్ల చేతుల్లోనో బీసీసీఐ చేతుల్లోనో లేదు. భారత ప్రభుత్వ నిర్ణయాన్నే బీసీసీఐ పాటిస్తుంది. అయితే, ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీ నేషనల్ ఈవెంట్లను అడ్డుకోబోమంటూ క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 14న పాక్‌తో టీమిండియా తలపడటం ఖాయమే.
పాకిస్తాన్‌తో స్పోర్ట్స్ ఈవెంట్లలో భారత ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు నిరాకరించింది. 2012-13లో ఇరు జట్ల మధ్య చివరిసారిగా దైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్, పాక్ టీమ్‌లు కేవలం ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలోనే ఎదురుపడుతున్నాయి. ఇకపై కూడా పాక్‌తో దైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, మల్టీ నేషనల్ ఈవెంట్లలో మాత్రం పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుందని స్పష్టం చేసింది. ‘ద్వైపాక్షిక సిరీస్‌ల విషయానికొస్తే భారత జట్లు పాకిస్తాన్‌కు వెళ్లం. భారత్‌లో ఆడేందుకు పాక్ జట్లను అనుమతించం. అంతర్జాతీయ, మల్టీ నేషనల్ ఈవెంట్లలో మాత్రం భారత్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్లు, అథ్లెట్లు పాల్గొనే అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటాయి. అలాగే, భారత్ ఆతిథ్యమిచ్చే మల్టీ నేషనల్ ఈవెంట్లలో పాక్ అథ్లెట్లు, జట్లు పాల్గొనొచ్చు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించడానికి భారత్ ప్రాధాన్య గమ్యస్థానంగా ఉంచటమే దీని లక్ష్యం. అంతర్జాతీయ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీకి చెందిన ఆటగాళ్లకు, టీమ్ అఫీషియల్స్,టెక్నికల్ సిబ్బంది, ఆఫీస్ బేరర్స్‌లకు వీసా ప్రక్రియ కూడా సరళీకృతం చేస్తాం.’అని క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.






