- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్‌లో ఆ ముగ్గురే గేమ్ చేంజర్స్ : సెహ్వాగ్
ఆసియా కప్‌లో భారత్ విజయాల్లో జస్ప్రిత్ బుమ్రా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తారని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.

దిశ, స్పోర్ట్స్ : మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఆసియా కప్‌లో భారత్ విజయాల్లో జస్ప్రిత్ బుమ్రా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తారని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆసియా కప్‌లో బుమ్రా, అభిషేక్, వరుణ్ గేమ్ చేంజర్స్‌గా మారతారని చెప్పాడు. ‘అభిషేక్ శర్మ గేమ్ చేంజర్ అవుతాడని అనుకుంటున్నా. బుమ్రా ఎప్పుడూ గేమ్ చేంజరే. వరుణ్ చక్రవర్తి మిస్టరీ బౌలింగ్‌తో చాంపియన్స్ ట్రోఫీలో సత్తాచాటాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లోనూ రాణిస్తాడు. ఈ ముగ్గురు చేంజర్లు భారత్‌ను గెలిపిస్తారు.’అని సెహ్వాగ్ తెలిపాడు.
అలాగే, ఇటీవల వర్క్‌లోడ్ గురించి తీవ్ర చర్చ జరుగుతుండగా దానిపై సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బౌలర్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అవసరమన్నాడు. ‘బ్యాటర్లకు వర్క్‌లోడ్ ప్రాబ్లమ్ ఉంటుందని అనుకోను. వారు ఆడగలరు. అలాగే, ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. బౌలర్లకు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు పనిభారం నిర్వహణ కీలకం.’అని చెప్పాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ సరిగా ఉంటేనే వారు చాలా కాలం ఆడగలరని, ఫాస్ట్ బౌలర్లు ఫిట్‌గా ఉంటే ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో భారత్ విజయవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చాడు.






