- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS PAK : టాస్ సమయంలో డ్రామా.. టాస్ ప్రెజెంటర్‌ను తెచ్చుకున్న పాక్
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. షేక్ హ్యాండ్ వివాదం నుంచి పాక్ ఆటగాళ్ల ఓవరాక్షన్ వరకు అంతా చర్చనీయాంశాలే. ఇవాళ దుబాయ్ వేదికగా భారత్, పాక్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. టైటిల్ పోరు ప్రారంభంలో కూడా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టాస్ సమయంలో ఇద్దరు ప్రెజెంటర్లు ఉండటం గమనార్హం. భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, పాకిస్తాన్ మాజీ పేసర్ వాకర్ యూనిస్ టాస్ ప్రెజెంటర్స్‌గా వ్యవహరించారు. సాధారణంగా ఒక్కరే ఉంటారు. పాక్ క్రికెట్ బోర్డు ఏసియన్ క్రికెట్ కౌన్సిల్‌ను అభ్యర్థించి యూనిస్‌ను టాస్ ప్రెజెంటర్‌గా తెచ్చుకుంది. టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లను శాస్త్రి, యూనిస్ వేర్వేరుగా ఇంటర్వ్యూ చేశారు. టాస్ గెలిచిన సూర్యతో శాస్త్రి మాట్లాడగా.. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో యూనిస్ మాట్లాడాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలో ఇద్దరు టాస్ ప్రెజెంటర్స్ ఉండటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






