5 గురు స్పిన్నర్లతో టీమిండియా... ఆసియా కప్ 2025 తుది జట్టు ఇదే !

by velandi.Saikiran |   (  Updated:2025-08-12 15:45:19  IST  )

అక్షర్, సుందర్, చక్రవర్తి, కుల్దీప్ కీలకంగా మారనున్నారు. బ్యాటింగ్ కూడా చేసే అభిషేక్ శర్మను స్పిన్నర్ గా

5 గురు స్పిన్నర్లతో టీమిండియా... ఆసియా కప్ 2025 తుది జట్టు ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి 28వ తేదీ వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నేపథ్యంలో.. టీమిండియా తుది జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కసరత్తులు చేస్తోందట. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను వాడుకోవాలని అనుకుంటున్నారట.

ఇందులో భాగంగానే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఈ నలుగురు కీలకంగా మారనున్నారు. అయితే నలుగురికి ఆడే ఛాన్స్ రాదు కాబట్టి... బ్యాటింగ్ కూడా చేసే అభిషేక్ శర్మను స్పిన్నర్ గా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన మొత్తం ఐదుగురు స్పిన్నర్లు.. ఆసియా కప్ కోసం సిద్ధం కావాల్సి ఉంటుంది. అలాగే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ కు అవకాశం లేనట్టే తెలుస్తోంది. ఇక సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండగా గిల్ వైస్ కెప్టెన్ అవుతాడని సమాచారం.

ఆసియా కప్ కోసం టీమిండియా అంచనా : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా/ప్రసిధ్‌ కృష్ణ.

Next Story