ఆసియా కప్ మ్యాచ్‌లు 30 నిమిషాలు ఆలస్యంగా.. కారణం ఏంటో తెలుసా?

by Harish |

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానుంది.

ఆసియా కప్ మ్యాచ్‌లు 30 నిమిషాలు ఆలస్యంగా.. కారణం ఏంటో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్ సమయాల్లో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన సమయానికి కంటే 30 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ధ్రువీకరించింది. యూఏఈలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా మ్యాచ్ టైమింగ్స్‌ను రీషెడ్యూల్ చేసినట్టు వెల్లడించింది. ముందుగా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లను రాత్రి 7:30 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే, తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. టోర్నీలో 19 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో 18 మ్యాచ్‌లకు ఇదే వర్తిస్తుంది. సెప్టెంబర్ 15న ఒమన్, యూఏఈ మధ్య జరగాల్సిన మ్యాచ్ సాయంత్రం 5:30 గంటలకు జరగనుంది. యూఏఈలో సెప్టెంబర్‌లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నివేదికలు అంచనా వేశాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుని సాయంత్రం వరకు అలాగే ఉంటాయని పేర్కొన్నాయి.


Next Story