- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2025 : ఆసియా కప్‌పై కీలక ప్రకటన.. టోర్నీ జరిగిందే అక్కడే.. ఎప్పటి నుంచి అంటే?
పురుషుల ఆసియా కప్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి.

దిశ, స్పోర్ట్స్ : పురుషుల ఆసియా కప్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఒక దశలో అసలు టోర్నీ జరుగుతుందా?లేదా? అన్న అనుమానాలు నెలకొనగా ఎట్టకేలకు టోర్నమెంట్ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఇటీవల జరిగిన ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆసియా కప్‌పై చర్చించారు. టోర్నీ ఆతిథ్య హక్కులు బీసీసీఐ వద్ద ఉండగా తటస్థ వేదిక యూఏఈలో టోర్నమెంట్ నిర్వహణకు బోర్డు అంగీకరించిన విషయం తెలిసిందే. టోర్నీ ప్రారంభంపై ఏసీసీ ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ శనివారం కీలక ప్రకటన చేశారు.
సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతుందని వెల్లడించారు. ‘యూఏఈలో ఏసీసీ పురుషుల ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. టోర్నీ తేదీలను ధ్రువీకరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ సెప్టెంబర్ 9న మొదలవుతుంది. ఫైనల్ 28వ తేదీన జరుగుతుంది.’అని నఖ్వీ తెలిపారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. యూఏఈలోని అబుదాబి, దుబాయ్‌లను ఆతిథ్య నగరాలుగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్ సహా శ్రీలంక, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ పాల్గొంటాయి. భారత్, పాక్ ఒకే గ్రూపులో ఉండే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా ఈ దాయాదుల పోరు షెడ్యూల్ చేసినట్టు సమాచారం.
- Tags
- Asia Cup 2025






