- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్‌కు లైన్ క్లియర్.. భారత జట్టు పాల్గొనేందుకు ప్రభుత్వం ఆమోదం
ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దిశ ,స్పోర్ట్స్ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా పాల్గొంటుందా?లేదా?అనే అనుమానాలకు తెరపడింది. ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. పాకిస్తాన్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ..‘మా నిర్ణయం స్పష్టంగా ఉంది. క్రికెట్, హాకీ, ఇతర ఏ క్రీడ అయినా అంతర్జాతీయ ఈవెంట్‌లో పాకిస్తాన్‌తో ఆడేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే ప్రభుత్వ వైఖరి అందరికీ తెలుసు.’అని తెలిపారు. కాగా, ఆసియా కప్‌కు యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల బీసీసీఐ వద్దనే ఉన్నప్పటికీ తటస్థ వేదికపై మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంంకానున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) షెడ్యూల్‌ను ప్రకటించనుంది.






