అక్షర్ ఏం తప్పు చేశాడు.. సెలెక్టర్లను ప్రశ్నించిన కైఫ్

by Harish |

త్వరలో జరగబోయే ఆసియా కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

అక్షర్ ఏం తప్పు చేశాడు.. సెలెక్టర్లను ప్రశ్నించిన కైఫ్
X

దిశ, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే ఆసియా కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. శుభ్‌మన్ గిల్‌‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇంతకుముందు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు అక్షర్‌‌పై వేటు వేస్తూ గిల్‌కు ఆ బాధ్యతలు ఇచ్చారు. దీనిపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అక్షర్‌ను ఎందుకు తొలగించారో చెప్పాలని సెలెక్టర్లను ప్రశ్నించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘వైస్ కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించారని అక్షర్ పటేల్‌కు ముందే చెప్పారని అనుకుంటున్నా. ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి అతడు ఈ విషయం తెలుసుకుని ఉండకూడదు. అక్షర్ ఎలాంటి తప్పు చేయలేదు. కాబట్టి అతడికి దీనిపై వివరణ ఇవ్వాలి’ అని కైఫ్ రాసుకొచ్చాడు. ఏడాది తర్వాత గిల్ టీ20 జట్టులోకి వచ్చాడు. ఇటీవలే టెస్టు పగ్గాలు చేపట్టిన అతనికి భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయాలనే ఉద్దేశంతోనే ఆసియా కప్‌లో వైస్ కెప్టెన్‌గా నియమించారన్న ప్రచారం జరుగుతుంది.


Next Story